Sunday, September 30, 2012

స్వాతంత్ర్యం

స్వాతంత్ర్యంTop Home
మహాత్ముల మరణం మరుసటి రోజున మరచే కల అవుతుందా
స్వాతంత్ర్య ఉద్యమం ఉదయం లేచి ఆడుకునే ఆట అవుతుందా 
తనువు చీల్చుతున్నా,రక్తం పారుతున్నా అలుపు తెలియని ఆకాంక్ష
 కరములు కాల్చుతున్నా,స్వరములు ఖండిస్తున్నా గుండె సడితో చేసే రణదీక్ష
పొలము సాగుచేసిన మనిషికి ఫలము అందక చేసిన పోరాటం   
స్వేచ్చెకోసం ఆరాటంతో బ్రతకటానికి చేసిన మహాపోరాటం 
రవిరాకతో నిద్రలేస్తున్న ఈలోకం చంద్రుడి రాకతోనే నిద్రిస్తుంది   
నిర్మలమైన నిశిరాత్రులలో కూడా క్షణ క్షణం చివరి క్షణం గా చేసిన పోరాట ఫలితమే స్వాతంత్ర్యము
TopHome

ప్రేమ లేఖ

ప్రేమ లేఖ                              Top Home
శ్వాసతో పంచని ఆశలను నేను నీతో పంచగలనా
స్వరముతో పొందని ఆనందం నీ మాటలతో  పొందగలనా 
కనుపాప మెదిలే ఓ క్షణం అయినా నవ్వుతూ చూడవా
నవ్వితే చూడాలనే ఆశ తప్ప నాకే కావాలనీ స్వార్ధం లేదు
తనివితీరా ఏడవాలి చేతనైతే  చేయి పట్టుకు కూర్చోవాలి
ఇలా నా మనసుకు తెలియని ఏవేవో ఆశలు
నాలొ ఏమి జరుగుతుందో నాకే తెలియదు 
నా మనసుకు ఏమికావాలో  నాకు తెలియదు 
నువ్వు పక్కన ఉంటె  చాలు అనే చిన్న ఆశ తప్ప ......
ఇది ప్రేమే అయితే .........ప్రేమ పంచగలవా ...... Top Home

నా బాల్యపు ఆవేదన

                                            నా బాల్యపు ఆవేదన                  Top Home
 
  ప్రేమ .......నరకపు లోయలవెంట సాగే ఓ అందమైన తీయని భావము 
భావము అంటేనే తెలియని నాభాల్యమున భరించలేని గోరము 
తనవి తీర ఎడ్చలేని వయసు ఏడిస్తే ఏమికావలి రా  అని బెదిరించే పెద్దలు 
అటుగా ప్రాణంలేని ఇష్టమైన అమ్మాయి ఇటుగా చావులోకూడా లోతుపాతులు వెతికే పెద్దలు 
ఏడ్వలేను అలాగని ఆగలేను పరుగులు తీశాను కేకలు వేశాను 
చిన్ని ..చిన్ని పాదాలతో ఎంత పరిగేడితే  ఏమి వస్తుంది ఊరి చివర ఉండే శ్మశానం తప్ప ....
ఎప్పుడు నాతొ గోడవ పడ్డట్లుగా ఉండే స్మశానం ఆక్షణం నాకు ...
దగ్గర గా తదేకంగా నావైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది 
తన తప్పు ఏమిలేదు తాను మాత్రం ఏమిచేస్తుంది 
ఆక్షణం ఆకురాలినది ఆ ఆకును తనలో దాచుకోవటం తప్ప ఏమిచేస్తుంది 
అప్పటివరకు స్మశానం కు ఆమడదూరం ఉండే నేను అమాంతం హత్తుకున్నట్లుగా మారిపోయాను 
సంద్యా కాలం సమయం లో ఓ చిన్న చిరు నవ్వుతో స్మశానం ను పలకరిస్తూ కాలం గడుపుతున్నాను ......
                                                                                                                 Top Home

కలగా మిగిలిన ప్రేమ

                                   కలగా  మిగిలిన ప్రేమ    Top Home


                                   కలగా  మిగిలిన ప్రేమ 

ఋతువులు మారుతున్న ఓ  క్షణం నన్ను తాకుతున్నది 
చంద్రుడు అస్తమించి రవి రాకకు వేచి చూస్తున్న వేల దగ్గర అవుతున్నది 
కొన్ని అందమైన నక్షత్రాల నడుమ  ఓ  అపురూప సౌందర్య వనిత ప్రకాశించింది 
ఎన్నో మేగాలు దాటుకొని నాకు చేరువగా నడుస్తున్నది 
ఆ క్షణం మబ్బులు మాయం మొగ్గలు పుష్పం 
ఆ అందమైన క్షణం లో నన్ను చేరిన సౌందర్యం చిన్న చిరునవ్వుతో 
            "స్వప్నం లో తిరుగాడే నా చిన్న హృదయం నీకు అందించనా 
              కాలం తో ప్రయాణం చేసే నా ఈ కాయం నీకు అర్పించనా 
             ఆనందపడే క్షణాలు అణువణువునా అందించనా ప్రియతమా " 
ఇలా 
 నా కనులు దాటని తన అందం తన పెదవి పలుకులతో ఆశలు కల్పించింది 
అంతటి అందం సొంతమవుతున్న ఆనందం లో గట్టిగా అరిచాను 
ఇంతలో మా అమ్మ వచ్చి నిద్రలేపింది లేచి చూస్తే అంతా మాయ,...
ఇలా నా ప్రేమ కలగానే మిగిలిపోయింది ........